1. SUJATHA MIRACLE
ఓం సచ్చితానంద పరబ్రహ్మ
పురుషోత్తమ పరమాత్మ
శ్రీ భగవతీ సమేత
శ్రీ భగవతే నమః

నా పేరు సుజాత. మాది కుప్పం టౌన్, చిత్తూరు జిల్లా. నేను అమ్మ భగవాన్ లను గత 20 సంవత్సరాలుగా పూజిస్తున్నాను. నా జీవితంలో జరిగిన అద్భుతం ను మీతో పంచుకొంటాను ఒకరోజు నేను ఇంట్లో ప్రసాదం చేయడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టి అన్నం వండుతున్నప్పుడు సడన్ గా కుక్కర్ బ్లాస్ట్ అయింది. అన్నం మొత్తం రూమ్ మొత్తం చిమ్మింది. ఆ సమయం లో నేను అక్కడే వున్నాను అయిన కూడా కొంచెం కూడా ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో స్టవ్ ను ఎలా ఆప్ చేసానో తెలియడం లేదు. ఆరోజు అమ్మ భగవాన్ లు పెద్ద ప్రమాదం నుండి కాపాడి అనుగ్రహించారు. ఇలాగా నా జీవితంలో కల్కి అమ్మ భగవాన్ లు రక్షణ కవచం వేసి ప్రతి క్షణం అద్భుతాలు చేస్తున్నారు. ఎన్నో అసాధ్యం అని నేను బయపడిన విషయాలును కూడా సుసాధ్యం చేశారు. ఆర్థికంగా గొప్ప స్థాయికి తీసుకెళ్లారు. మరియు ఇపుడు కొంతమంది కల్కి భక్తులు కలిసి ఆపదలో ఉన్న భక్తుల కోసం గ్రూప్ ప్రేయర్స్ చేస్తున్నాము. చేసిన వారికి శ్రీకల్కి వెంటనే అద్భుతాలు చేస్తున్నారు. అందరి కోసం ప్రేయర్ చేసే ఆ భాగ్యాన్ని ప్రసాదించిన కల్కి అమ్మ భగవాన్ లకు వేల వేల కృతజ్ఞతలు
సత్యలోక పుణ్యక్షేత్రం లో మరో అద్భుతమైన శక్తి కేంద్రం గోల్డెన్ రాక్. ఇదే పరంజ్యోతి శ్రీ అమ్మ భగవాన్ భక్తులకు జ్ఞానాన్ని దీక్షను మానవ జాతి అభివృద్ధిని కాంక్షిస్తూ సంకల్పం తీసుకొన్న స్థలము ఇక్కడ భక్తులు ప్రదక్షణలు చేసిన వారి కోరికలు నెరవేరి అద్భుతాలు జరుగుతాయి
ప్రతి ఆదివారం గోల్డెన్ రాక్ వద్ద ఆరోగ్యం ,ఐశ్వర్యం ,బాంధవ్యాలు మెరుగు పడటం, సంతానం , వివాహం , ఉద్యోగం కర్మ విమోచనం , కోసం పూజలు జరుగుతాయి . ఈ ప్రోగ్రాం లో లోకల్ భక్తులు వందలాదిగా పాల్గొంటుంన్నారు .
ఇక్కడ భక్తులకు అన్నదానం జరుగుతుంది.

2. లక్ష్మీదేవి MIRACLE

నమస్తే అమ్మ భగవాన్ శరణం నా పేరు లక్ష్మీదేవి మాది కేజిఎఫ్. అమ్మ భగవానులను చాలా సంవత్సరాల నుండి కొలుస్తున్నాను అమ్మ భగవాన్ దయవల్ల ప్రతిదీ నాకు అద్భుతంగా మారిపోతుంది. ఇలా చెప్పాలంటే నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి ఈరోజు నేను మీతో ఇంకొక అద్భుతాన్ని పంచుకుంటాను మాకు మొదట్లో నివసించడానికి ఇల్లు ఉండేది కాదు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇలా ఉండగా కొంతమంది భక్తులు గోల్డెన్ రాక వద్ద చిన్న చిన్న రాళ్లు పెట్టి ఇల్లు కావాలని కోరుకున్నారు వాళ్ళందరికీ కూడా అద్భుతాలు జరిగాయి. అది గమనించి నేను కూడా గోల్డెన్ రాకపోతే చిన్న చిన్న రాళ్లు పెట్టి ఇల్లు కావాలని అమ్మ భగవాన్లకు ప్రేయర్ చేశాను. అది చేసిన వెంటనే కొన్ని రోజుల్లోనే ఇంటికి కావాల్సినవన్నీ సమకూరి ఒక మంచి ఇల్లు కట్టుకున్నాము. మరియు మా కొడుకు నా మాట వినకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు పెళ్లి విషయంలో నేను చాలా బాధతో క్షమా భగవాన్లకు ప్రేయర్ చేసుకున్నాను నేను చెప్పిన విధంగానే నా కొడుకు పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాను అనుకోకుండా నా కొడుకు నా దగ్గరకు వచ్చి నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా అని చెప్పాడు. నాకు నచ్చిన విధంగానే ఆ అమ్మాయి తోనే పెళ్లి జరిగింది నాకు చాలా ఆనందం అనిపించింది అంతేకాకుండా మగ బిడ్డ కావాలని మేము అమ్మ భగవానులని నత్తం వెళ్లి ప్రార్థన చేశాము మెత్తంలో శ్రీ భగవాన్ జన్మస్థలం అలా చేసిన కొన్ని రోజుల్లోనే అమ్మ భగవాన్ అనుగ్రహంతో మగ బిడ్డ జన్మించారు ఇలా నేను కోరుకున్నవన్నీ నా జీవితంలో అద్భుతాలుగా మారిపోయాయి అది ఐశ్వర్యంలో గాని ఆరోగ్యం గాని సంతానంలో గాని వివాహంలో గాని ఇలాగ ప్రతిదీ నా జీవితంలో అద్భుతాలుగా మారిపోయామా భగవాన్లు మా ఇంటిలో ఒక దైవంగా మారిపోయి ప్రతిదీ అమ్మ భగవాన్ చెప్పి నేను చేస్తున్నాను అమ్మ భగవానుడు నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు ప్రతి లోకంలో అమ్మ భగవాన్ చేసిన అద్భుతాలు కృతజ్ఞతగా ప్రతి వారము నేను భక్తులను తీసుకొచ్చి సేవ చేస్తూ ఉంటాను నా జీవితంలో అమ్మ భగవానులు అద్భుతాలు చేసినందుకు అనుగ్రహం కురిపించినందుకు పరంజ్యోతి అమ్మ భగవాన్లకు అనంతకోటి కృతజ్ఞతలు.
3.Yashodamma Kalki Miracle

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే నా పేరు యశోదమ్మ. మాది రామకుప్పం ప్రక్కన హరిజన కోట అనే చిన్న గ్రామం.నేను సత్యలోకం లో ప్రతి ఆదివారం గోల్డెన్ రాక్ వద్ద జరిగే పూజకు వెళ్లే దానిని. అక్కడ భక్తులకు జరిగిన అద్భుతాలు చూసి ఆనందం కలిగి మా గ్రామంలో చాలా మందికి తెలియ చేశాను. వారు కూడా అక్కడ గోల్డెన్ రాక్ వద్దకు వచ్చి భక్తులుగా మారి పోయారు. ఈరోజు మాఇంట్లో జరిగిన అద్భుతం మీ అందరితో చెప్పుతున్నందుకు మహా భాగ్యము గా భావిస్తున్నాను. నా కొడుక్కి వీపరీతంగా ప్రజ్వరం వచ్చి ఏడుస్తూ వున్నాడు. నేను ఎం చేయాలో తెలియక వెంటనే శ్రీ మూర్తి వద్ద కు వెళ్లి ప్రార్థన చేశాను. నేను ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళే అవకాశం కూడా లేదు. నీవు అద్బుతం చెయ్యాలి అని దీనంగా • ప్రార్థన చేశాను. కొద్ది సేపటికి జ్వరం తగ్గిపోయింది. చాలా ఆనందం కలిగింది. నాకు తెలుసు నా అమ్మ భగవాన్ నన్ను కాపాడ తారని. ఎందుకంటే వారితో నాది తల్లితండ్రులు బంధం.నా అమ్మ భగవాన్ లకు కృతజ్ఞతలు చెప్పు కొన్నాను. ఈరోజు సాయంత్రం నా కొడుకు నన్ను బిగ్గరగా పిలిచాడు. నేను వెంటనే వెళ్ళి చూడగానే నా అమ్మ భగవాన్ శ్రీ మూర్తి మొత్తం పాలు ఏక ధాటిగా వస్తూ ఉంది. ఒక్క క్షణం అద్భుతం చూసి నా మనసు ఆగిపోయింది. తర్వాత నేను గ్రామంలో అందరినీ పిలిచాను. వారు అద్భుతం చూసి ఫోటోలు తీశారు. & ఆనందంతోభజనలు చేశారు. అందరూ హారతులు ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ చిన్న పిల్లలకు కూడా శ్రీ మూర్తి లో అమ్మ భగవాన్ లు నవ్వినట్లు, మాట్లాడినట్లు వివిధ రూపాలలో దర్శనం ఇచ్చారు.ఈ రోజు అమ్మ భగవాన్ లు సినిమా గ్రామంలో అందరికీ స్వంత బంధువుగా,తల్లి తండ్రులు గా, ఇష్ట దైవంగా వారి హృదయంలో కొలువై వున్నారు. ఈరోజు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా, జీవించడానికి కారణం వారికి అమ్మ భగవాన్ తో
వున్న బంధమే నిదర్శనం. * అమ్మ భగవాన్ లు బంధం కలిగిన భక్తులకు అద్భుతాలు చేసే పరాధీనులు.వారే భక్త ముక్కోటి దేవత స్వరూపం అని మా గ్రామస్థులు భావించారు
4.Bhulakshmi సంతానం Miracle (బూలక్ష్మి)

నమస్తే అమ్మ భగవాన్ శరణం.
ఓం సచ్చితానంద పరబ్రహ్మ
పురుషోత్తమ పరమాత్మ
శ్రీ భగవతీ సమేత
శ్రీ భగవతే నమః
నా పేరు భూలక్ష్మి మేము రాజుపేట రోడ్డుకు దగ్గర్లో ఉన్న గ్రామంలో నివసిస్తున్నాము. నేను గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏఎన్ఎం గా చాలా సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాను. నాకు మగ బిడ్డ పుట్టాలని మా ఇంట్లో వారు మా బంధువులు చాలా హాస్పిటల్లో చూపించారు. మరియు చాలా రకాల దేవాలయాల్లో కూడా పూజలు చేశారు. ఆయన ఏమీ ఫలితం కనిపించలేదు. నేను అదే ధ్యాసతో బాధపడుతూ ఉండేదాన్ని. అంతేకాక డాక్టర్లు కూడా చెక్ చేసి మీ గర్భం లోపల ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు మగసంతానం కలిగే అవకాశం ఉండదు అన్నారు. అంతేకాకుండా కొంతమంది ఏదో నిన్ను చెడు శక్తి బాధిస్తుంది అన్నారు. నేను దీని గురించి బాధపడుతూ ఉండగా ఒకరోజు మాకు దగ్గరలో ఉన్న అమ్మ భగవాన్ ఆలయం నుండి కొంతమంది సేవకులు వచ్చి మా ఊర్లో పూజ పెట్టారు. వారు సత్య లోకానికి రమ్మని చెప్పారు. నేను అందరి లాగానే సత్య లోకానికి వెళ్లి అక్కడ గోల్డెన్ రాక్ వద్ద పూజలో పాల్గొన్నాను. ఆరోజు నాకు చాలా ఆనందం కలిగింది. ఆరోజు నుండి జరిగే అన్ని పూజలు లో పాల్గొన్నాను. తర్వాత నన్ను బాధిస్తున్న చెడు శక్తులు తొలిగిపోయినట్లు అనిపించింది. మీద నమ్మకం పెరిగింది. అమ్మ భగవాన్ మూల మంత్రం చెప్పడం ప్రారంభించాను. ఒకరోజు హాస్పిటల్ లో వెళ్లి చెక్ చేసుకున్నప్పుడు నీవు ప్రెగ్నెన్సీ గా ఉన్నావ్ అని చెప్పారు డాక్టర్లు. నా ఆనందానికి పోయింది. అలాగనే కోరుకున్న విధంగానే నాకు అమ్మ భగవానులు మగ బిడ్డను ప్రసాదించారు. తర్వాత నేను మొక్కుబడి కూడా చేసుకున్నా. తర్వాత నేను ఆ భగవాన్ల దివ్య మంగళ దర్శనంలో కూడా పాల్గొన్నాను. ఇలాగ అమ్మవారి నా జీవితంలో అంతేకాకుండా చాలా అద్భుతాలు చేశారు.
5.శాంతమ్మ కల్కి అద్భుతాలు

ఓం సచ్చితానంద పరబ్రహ్మ
పురుషోత్తమ పరమాత్మ
శ్రీ భగవతీ సమేత
శ్రీ భగవతే నమః
కాలు భాగంలో మధ్య వ్రేలుకి ఇన్ఫెక్షన్ కావడం వల్ల చీముపట్టి నేను 2 నెలలు చాలా బాధ పడ్డాను. చికిత్స తీసుకొన్నకూడా నోప్పి తగ్గకుండా పోవడంతో, డాక్టర్ గారు మీరు చేసిన నిర్లక్ష్యం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువుగా ఉంది కావున ఆ వ్రేళ్ళు భాగాన్ని పూర్తిగా తీసివేయాలి అన్నాడు. హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన మాటను విన్న వెంటనే షాక్ కి గురి అయ్యాము. ఇంట్లో అందరూ భయపడ్డారు. వెంటనే మా కొడుకు సత్యలోకం తీసుకెళ్లి అక్కడ గోల్డెన్ రాక్ వద్ద ఉన్న “శ్రీ కల్కి ఆరోగ్య తైలం” ను ప్రేయర్ చేసి మర్దన చేసాడు. అక్కడ దాసాజి గారు ఇక్కడ వచ్చి ఈ తైలం మర్ధన చేసిన ఎంతో మందికి కల్కి వెంటనే అనుగ్రహాన్ని కురిపించారు అన్నారు. తర్వాత మేము కల్కి మీద భారం వేసి మొక్కుబడి చేసాము. మాకొసం కల్కి వాట్సప్ గ్రూపులలో ఉన్న భక్తులు చాలా మంది ప్రేయర్స్ చేశారు. తర్వాత క్రమేణా ఇన్ఫెక్షన్ తగ్గుతూ వచ్చింది. డాక్టర్ గారు చూసి ఆశ్చర్య పోయారు.మరియు ఆరోజు నాకొడుకు కల్కి వద్ద దీపంలో వెలుగుతున్న జ్యోతిని ఫోన్ ఫోటో తీస్తే, పాదుకలు రూపంలో దర్శన మిచ్చింది. ఆరోజు చాలా ఆనందం కలిగింది. ఇలాగ కల్కి నాతో పాటూ మా కుటుంబానికి అనుగ్రహముతో కూడిన ఎన్నో అద్భుతాలు చేశారు. ఆ దేవదేవునికి పాదాభివందనం చేస్తున్నాను.
జై బోలో గోల్డెన్ రాక్ ఆరోగ్యతైల కల్కి కి జై.